🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

గురువారం, 10 Sep 2026, 6:39 PM

QR Code

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆరు డీఏలపై సీఎం హామీ

News Image

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడితో పాటు పీఆర్‌సీ నివేదిక ఆలస్యంపై జేఏసీ నేతలు సీఎంకు వివరించారు. పీఆర్‌సీ కమిటీ నివేదిక తనకు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటానని సీఎం చెప్పినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు.

🏠 Home