మిడ్ వెస్ట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫ్రీజర్ బాక్స్ అందజేత...
సూర్యాపేట సెప్టెంబర్ 11: మీడ్ వెస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కోదాడ మండలం మంగలి తండా గ్రామ పంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ను ఉచితంగా శుక్రవారం అందజేశారు.ఈ కార్యక్రమం మంగలి తండా సర్పంచ్ దరావత్ బాబ్జీ నాయక్ సమక్షంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీకి అవసరమైన ఫ్రీజర్ బాక్స్ను సంస్థ ప్రతినిధులు అందజేశారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మిడ్ వెస్ట్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసి, సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ అకౌంట్స్ మేనేజర్ శ్రీనివాస్, హచ్ ఆర్ తరుణ్, సైదులు, , గ్రామ కార్యదర్శి వెంకటనారాయణ, ఉప సర్పంచ్ ధరావత్ కృష్ణవేణి హనుమంతు, వార్డు సభ్యులు ధరావత్ కమల కీమా ,ధరావత్ జయ జెoథా, ధరావత్ రాజు, మలావత్ వెంకటేశ్వర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.