🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 September 2026, 7:03 pm Posted by : ARYADVI NEWS

మోదీ–పుతిన్‌ ‘కార్‌ డిప్లమసీ’.. మరోసారి వైరల్‌!

News Image
ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఢిల్లీలో మరోసారి ఒకే కారులో ప్రయాణించారు. భారత్‌ మండపంలో ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇద్దరూ కలిసి ఇన్నోప్రామ్‌ ప్రదర్శనకు వెళ్లారు.ఇది తొలిసారి కాదు. బిష్కెక్‌, టియాంజిన్‌లోనూ మోదీ–పుతిన్‌ ఒకే కారులో ప్రయాణించారు. దీంతో ఈ దృశ్యాలను ‘కార్‌ డిప్లమసీ’గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.భేటీలో మోదీ.. పుతిన్‌కు రష్యన్‌ భాషలోకి అనువదించిన ‘తిరుక్కురళ్‌’ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. బ్రిక్స్‌ సదస్సు కోసం పుతిన్‌ ఢిల్లీకి చేరుకోగా, ఆయనకు ఘన స్వాగతం లభించింది.
🏠 Home