🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 September 2026, 11:33 pm Posted by : ARYADVI NEWS

టైర్లు నల్లగానే ఎందుకుంటాయి? అసలు కారణం ఇదే!

News Image
కారు, బైక్‌ ఇలా ఏ వాహనం చూసినా టైర్లు నల్లగానే కనిపిస్తాయి. అయితే టైర్లు మొదటి నుంచే నల్లగా ఉండేవి కావు. తొలినాళ్లలో తయారు చేసిన టైర్లు తెల్లగా ఉండేవి. రబ్బరుకు సహజంగా ప్రత్యేకమైన రంగు ఉండదు.1900ల ప్రారంభంలో టైర్ల తయారీలో రబ్బరుతో పాటు కార్బన్‌ బ్లాక్‌ కలపడం ప్రారంభించారు. దీనివల్ల టైర్ల బలం, మన్నిక గణనీయంగా పెరిగాయి. అంతేకాకుండా వేడి, రాపిడిని తట్టుకునే సామర్థ్యం కూడా మెరుగుపడింది. దీంతో టైర్లు ఎక్కువ కాలం పనిచేయడం ప్రారంభించాయి.కార్బన్‌ బ్లాక్‌ వినియోగం పెరగడంతో టైర్లు పూర్తిగా నల్లగా మారాయి. ఒకప్పుడు నల్లటి మధ్యభాగం, తెల్లటి పక్కభాగాలతో టైర్లు కూడా ఉండేవి. అయితే 1970ల నాటికి నల్లటి టైర్లే సాధారణంగా మారిపోయాయి.అందుకే టైర్ల నలుపు కేవలం రంగు కోసం కాదు.. వాటి బలం, మన్నిక, పనితీరును మెరుగుపరచడంలో కార్బన్‌ బ్లాక్‌ కీలక పాత్ర పోషిస్తుంది.
🏠 Home