🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

శనివారం, 12 Sep 2026, 8:46 AM

QR Code

బ్రిక్స్ సదస్సుకు జిన్‌పింగ్.. మోదీతో భేటీపై ఆసక్తి

News Image

బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఢిల్లీకి బయలుదేరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్‌కు వస్తున్నారు. జిన్‌పింగ్‌తో పాటు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సహా ఉన్నతస్థాయి ప్రతినిధులు కూడా పర్యటనలో పాల్గొంటున్నారు.సదస్సు సందర్భంగా మోదీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుండటం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను మరింత స్థిరీకరించడంపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా సరిహద్దుల్లో శాంతి, భద్రతకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు రావచ్చని భావిస్తున్నారు.మోదీ-జిన్‌పింగ్ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత్‌లోని చైనా రాయబారి జు ఫెయిహాంగ్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య విభేదాలను పరిష్కరించుకుంటూ సహకారాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.

🏠 Home