🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 12 September 2026, 9:00 am Posted by : ARYADVI NEWS

బీసీ కులగణనపై కేంద్రాన్ని ప్రశ్నించిన పొన్నం

News Image
2027 జనగణనలో బీసీ కులగణన కోసం ప్రత్యేక కాలమ్ ఎందుకు పెట్టలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీల జనాభా ఎంతుందో లెక్కించకుండా రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, బడ్జెట్ కేటాయింపులు ఎలా నిర్ణయిస్తారని నిలదీశారు.తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్రం కూడా జనగణనలో బీసీల కుల వివరాలను శాస్త్రీయంగా నమోదు చేయాలని డిమాండ్ చేశారు.కులగణన సామాజిక న్యాయానికి ఎంతో కీలకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీసీ కులగణనకు అనుకూలమా.. వ్యతిరేకమా అనే విషయాన్ని బీజేపీ సభ్యులు స్పష్టంగా చెప్పాలని ఆయన కోరారు. మరోవైపు బీసీ డిక్లరేషన్ హామీల అమలుపై బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
🏠 Home