ఫీజు రీయింబర్స్మెంట్పై రేవంత్ ఫైర్!
అసెంబ్లీలో విద్యపై జరిగిన చర్చలో సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్లో అక్రమాలకు పాల్పడే కాలేజీలకు నిధులు ఇవ్వబోమన్నారు. నిజాయతీగా నడిచే కాలేజీలకే రీయింబర్స్మెంట్ అందిస్తామని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ కాలేజీల ప్రైవేటీకరణపై వస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. అవసరమైతే జీవో 97లో మార్పులు చేస్తామని తెలిపారు.