🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

శనివారం, 12 Sep 2026, 10:37 PM

QR Code

వెంకీ–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’.. నవ్వుల మధ్య థ్రిల్లింగ్ ట్విస్ట్!

News Image

విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా టీజర్ విడుదలైంది. వెంకటేశ్ తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకోగా.. టీజర్‌ మొత్తం వినోదభరితంగా సాగింది. మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక సమస్యలను సరదాగా చూపించారు.కుటుంబం ‘AK 47’ పేరున్న డ్యూప్లెక్స్ ఇంట్లోకి వెళ్లిన తర్వాత కథలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. ఓ క్రైమ్ ఘటన, విలన్ ఎంట్రీతో టీజర్ ఒక్కసారిగా సీరియస్ మోడ్‌లోకి మారుతుంది. దీంతో సినిమాలో కామెడీతో పాటు సస్పెన్స్, క్రైమ్, ఎమోషన్ కూడా ఉంటాయని టీజర్ స్పష్టం చేసింది.వెంకటేశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. నారా రోహిత్, దివ్యేందు శర్మ, నివేదా పేతురాజ్, రావు రమేశ్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ నేపథ్య సంగీతం టీజర్‌కు మరింత ఆకర్షణను తీసుకొచ్చింది.గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. టీజర్‌కు వస్తున్న స్పందనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

🏠 Home