🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

ఆదివారం, 13 Sep 2026, 8:53 AM

QR Code

వైసీపీలో కీలక మార్పులు.. నేతలకు కొత్త బాధ్యతలు

News Image

వైసీపీలో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల్లో మార్పులు చేశారు. వైవీ సుబ్బారెడ్డికి ఉమ్మడి గుంటూరు జిల్లా బాధ్యతలు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి ఉమ్మడి కృష్ణా, ప్రకాశం జిల్లాల సమన్వయ బాధ్యతలు అప్పగించారు. బీరక సురేంద్రబాబును రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమించారు. డీఎస్సీ-2025 అంశంపై పోరాట కమిటీతో పాటు న్యాయపోరాటం కోసం ప్రత్యేక లీగల్‌ సెల్‌ను కూడా ఏర్పాటు చేశారు.

🏠 Home