🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 September 2026, 6:25 pm Posted by : ARYADVI NEWS

అజ్మీర తండా గ్రామ పంచాయతీకి 200 గజాల స్థలం విరాళం

News Image
భర్త జ్ఞాపకార్థం భార్య నర్మద సేవా నిర్ణయం
లక్షల విలువైన భూమిని గ్రామాభివృద్ధికి అందజేత
సూర్యాపేట సెప్టెంబర్ 13 :అనంతగిరి మండలంలోని అజ్మీర తండా గ్రామపంచాయతీ కార్యాలయ నిర్మాణం కోసం కంసాని రామారావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి నర్మద 200 గజాల స్థలాన్ని విరాళంగా అందజేశారు. ఆదివారం గ్రామస్థుల సమక్షంలో స్థలానికి సంబంధించిన పత్రాలను పంచాయతీ ప్రతినిధులకు అందించారు. లక్షల రూపాయల విలువైన స్థలాన్ని గ్రామ అభివృద్ధి కోసం విరాళంగా ఇవ్వడం అభినందనీయమని సర్పంచ్‌ అజ్మీర శ్రీవిద్య బాలకృష్ణ పేర్కొన్నారు. పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి స్థలం సమకూరడంతో నిర్మాణ పనులకు మార్గం సుగమమైందన్నారు. నూతనంగా ఏర్పడ్డ గ్రామపంచాయతీ మరింత అభివృద్ధి చేసేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా నర్మదను సర్పంచ్‌తో పాటు మాజీ ఎంపీటీసీ గింజుపల్లి రమేష్‌ అభినందించారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
🏠 Home