దళిత స్పీకర్‌పై వ్యాఖ్యలు.. ఫామ్‌హౌస్ వద్ద నిరసన
దళిత స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ దళిత ఎమ్మెల్యేలు, నాయకులు ఫామ్‌హౌస్ వద్ద ఆందోళన చేపట్టారు. దళితులను కించపరిచేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. మాల, మాదిగలు ఐక్యంగా నిలిచి తమ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. దళితులపై రాజకీయ పార్టీల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.