🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

ఆదివారం, 13 Sep 2026, 10:26 PM

QR Code

69 అడుగుల ఖైరతాబాద్ బడా గణేష్.. పూర్తి రూపం చూశారా?

News Image

హైదరాబాద్‌లో కొలువుదీరిన ఖైరతాబాద్ మహా గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది 72వ ఖైరతాబాద్ బడా గణేష్గా 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహా గణపతి రూపంలో దర్శనమిస్తున్నాడు. విగ్రహ ఏర్పాటు పూర్తవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణపయ్యను దర్శించుకుంటున్నారు. సోమవారం ఉదయం గవర్నర్ చేతుల మీదుగా తొలి పూజ నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.

🏠 Home