🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 September 2026, 4:52 pm Posted by : ARYADVI NEWS

సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా

News Image

*నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యం.. సద్వినియోగం చేసుకోవాలి*
*సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారు*

నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సెప్టెంబర్ 19న కోదాడ పట్టణంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను సూర్యాపేట జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *కొప్పుల వేణారెడ్డి* గారు పిలుపునిచ్చారు.
సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ *కొప్పుల వేణారెడ్డి* గారు మాట్లాడుతూ.. రాష్ట్ర భారీ నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు *ఉత్తమ్ కుమార్ రెడ్డి* గారి సహకారంతో కోదాడ పట్టణంలో ఈ మెగా జాబ్ మేళాను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ తదితర విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ప్రతిభకు తగిన ఉద్యోగాలను పొందాలని కోరారు.
అదేవిధంగా మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై ఈ నెల 15న కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్న సన్నాహక సమావేశానికి ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ తదితర కళాశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా హాజరై సహకరించాలని కోరారు. జాబ్ మేళా వివరాలను కళాశాలల ద్వారా ప్రతి నిరుద్యోగ యువతీ యువకుడికి చేరేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని *కొప్పుల వేణారెడ్డి* గారు పిలుపునిచ్చారు.
🏠 Home