🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

మంగళవారం, 15 Sep 2026, 6:00 PM

QR Code

కేటీఆర్‌.. దమ్ముంటే ఫామ్‌హౌస్ సీసీ ఫుటేజ్ బయటపెట్టు: మూడ్ మోహన్ నాయక్

News Image

తుంగతుర్తి నియోజకవర్గం టీపీసీసీ సోషల్ మీడియా

అసెంబ్లీలో గందరగోళం సృష్టించే కుట్రతో కేసీఆర్‌కు సంబంధం లేదంటే.. బీఆర్‌ఎస్‌ నాయకులతో ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన సమావేశానికి సంబంధించిన పూర్తి సీసీ ఫుటేజ్‌ను బయటపెట్టాలని తుంగతుర్తి నియోజకవర్గం టీపీసీసీ సోషల్ మీడియా ప్రతినిధి మూడ్ మోహన్ నాయక్ డిమాండ్ చేశారు.ఫామ్‌హౌస్‌ సమావేశానికి సంబంధించిన ఫుటేజ్ బయటపెడితే కుట్ర ఎవరిదో, అసెంబ్లీలో గందరగోళం వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుస్తుందని అన్నారు. అసలు వ్యూహం ఎవరిదో కూడా స్పష్టమవుతుందని పేర్కొన్నారు.

గతంలో బీఆర్‌ఎస్‌ భవన్‌ నుంచే రైతుల పేరుతో కుట్రలు చేసి అడ్డంగా దొరికిన చరిత్ర మీది కాదా? అని ప్రశ్నించారు. మాటలతో కాకుండా ఫామ్‌హౌస్‌ సీసీ ఫుటేజ్‌ను బయటపెట్టి సమాధానం చెప్పాలని కేటీఆర్‌ను సవాల్ చేశారు. తన ఛాలెంజ్‌ను స్వీకరిస్తారా.. లేక నిజం బయటపడుతుందనే భయమా? అని మూడ్ మోహన్ నాయక్ ప్రశ్నించారు.

🏠 Home