🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 September 2026, 6:02 pm Posted by : ARYADVI NEWS

మట్టి గణపతిని ఏర్పాటు చేయడం అభినందనీయం: డాక్టర్ కరుణశ్రీ

News Image
సూర్యాపేట సెప్టెంబర్ 15 :కోదాడ మున్సిపాలిటీ 30వ వార్డులో శ్రీరామ గణేష్ యూత్ ఆధ్వర్యంలో 11 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని డాక్టర్ కరుణశ్రీ అన్నారు. బుధవారం వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన గణనాథుడి ఊరేగింపులో ఆమె పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కరుణశ్రీ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాల ఏర్పాటును ప్రోత్సహించాలని కోరారు. మట్టి గణపతి విగ్రహాల వల్ల చెరువులు, కాలుష్యానికి గురికాకుండా ఉంటాయని, ప్రజల్లో పర్యావరణంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.శ్రీరామ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించాలని ఆమె ఆకాంక్షించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు డాక్టర్ కరుణశ్రీని శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేశారు.ఉత్సవాలకు సహాయ సహకారాలు అందిస్తున్న ధరణి హాస్పిటల్ యాజమాన్యానికి, గత ఐదేళ్లుగా కమిటీకి అండగా నిలుస్తున్న దాతలకు, 11 అడుగుల మట్టి విగ్రహాన్ని అందించిన సట్టు సీతారాములు కుటుంబ సభ్యులకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు వార్డు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీరామ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు, భక్తులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home