🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

బుధవారం, 16 Sep 2026, 6:37 PM

QR Code

ప్రజా ఉద్యమమే నాణ్యమైన విద్య కు పునాది

News Image

రౌండ్ టేబుల్ సమావేశం లో మాజీ తెలంగాణా విద్యా కమీషన్ చైర్మన్ ఆకునూరి మురళి

ఖమ్మం ప్రతినిధి: సెప్టెంబర్, 16: ఖమ్మం : ప్రజలకు నాణ్యమైన విద్య లభించాలంటే రాజకీయ వ్యవస్థ పై ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలంగాణా మాజీ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు . ప్రజల నుండి డిమాండ్ లేకుండా ఏ పాలకవర్గం విద్యా వ్యవస్థను సరిదిద్దుతుందని భావించలేము , ఆశించడం కూడా పొరపాటు అవుతుందని అన్నారు . బుదవారం ఉదయం ఖమ్మం మయూరి సెంటర్ లోని శ్రీధర హోటల్ లో విద్యాబిమానులు , ఉపాద్యాయ , విద్యార్థి సంఘాలు , విద్యార్థుల తల్లిదండ్రులు , సామాజిక కార్యకర్త లుతదితర వర్గాలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం లో ఆయన మాట్లాడారు . ప్రస్థుతం తెలంగాణా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఐసియులో ఉందని , ప్రజలే డాక్టర్లు గా మారి దానికి చికిత్స చేసి బ్రతికించుకోవాలని పిలుపునిచ్చారు . ప్రతిసంవత్సరం 40లక్షలమంది పిల్లల తల్లిదండ్రులు అధిక ఫీజులు చెల్లించి ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారని అన్నారు . ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణ కు చట్టం చేయవలసిన అవసరం ఉందని అన్నారు . ప్రభుత్వ పాఠశాల లను అన్ని సౌకర్యాలు గల తెలంగాణా పబ్లిక్ స్కూల్స్ గా మార్చితే ప్రైవేటు బడులకు పిల్లలను పంపాల్సిన అఘాయిత్యం ఏముంటుంది అని ప్రశ్నించారు . ప్రభుత్వ పాఠశాల ల్లో ప్రస్తుతం 37శాతం మంది పిల్లలే చదువుతున్నారని అన్నారు . ఇలాగే అసౌకర్యంగా కొనసాగితే మరింత ప్రభుత్వ బడి దిగజారే అవకాశం ఉందని అన్నారు . జాతీయ స్థాయి యుడైస్ గణాంకాలు ప్రకారం తెలంగాణా లో 2,582 ఓకే గదిలో నడుస్తున్న పాఠశాలలు ఉన్నాయని , సున్నా విద్యార్థుల నమోదుతో 2,245 పాఠశాలలు మూతపడ్డాయని పేర్కొన్నారు . మూతపడ్డ పాఠశాలల జాబితా లో మన రాష్ట్రం రెండవ స్థానం లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు . తెలంగాణాలో ప్రతి పిల్లవాడికి విద్య అందాలంటే బడ్జెట్ లో కనీసం గా 18శాతం నిధులు కెటాయించాలని అన్నారు . ప్రైవేటు పాఠశాల మౌళిక సదుపాయాల ను , భూమి విలువ , భావన విలువ , ఉపాద్యాయులు అర్హతలు , వేతనాలు , విద్యార్థుల కు అందిస్తున్న సౌకర్యాలు దృష్టి లో పెట్టుకొని ప్రైవేటు పాఠశాల నియంత్రణ చట్టం తేవాలని అన్నారు . ప్రజలకు అవసరం అయిన మౌళిక సౌకర్యాలు కలిగించే ప్రభుత్వం రావాలంటే నోటు తీసుకోకుండా ప్రజలు ఓటేసే స్థితి రావాలని అన్నారు . రౌండుటేబుల్ సమావేశం లో బస్సుయాత్ర లో పాల్గొన్న తెలంగాణా ప్రజా ఫ్రంటు కోర్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ పద్మజాషా , ఐఏయస్ మాజీ అధికారి యం.చంపాలాల్ , పి.అశోక్ కుమార్ , సృజన యాదవ్ , యం.కు పోరన్న , యం.నర్సింహరావు , హరీష్ , రుబీనా , నిఖిల్ , జగదీష్ తదితరులు పాల్గొన్నారు . రౌండ్ టేబుల్ సమావేశం కు సీనియర్ జర్నలిస్టు , ఎడ్యుకేషన్ ఎనలిస్టు ఎన్.తిర్మల్ మోడరేటర్ గా వ్యవహరించారు రౌండ్ టేబుల్ సమావేశం లో డాక్టర్ యంయఫ్ గోపినాథ్ , భద్రూనాయక్ , పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు కట్టా.శేఖర్ , టిపిటీయఫ్ జిల్లా అధ్యక్షులు జి.మల్లయ్య , యుటీయఫ్ ప్రతినిధి ఉద్దండు , ధర్మసమాజ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సుంకర శ్రీనివాస్ , పిడియస్యు జిల్లా కార్యదర్శి మస్తాన్ , బలహీన వర్గాల జాక్ కన్వినర్ పి.రాంబాబు , కనకయ్య , రిటైర్ ఉపాద్యాయ సంఘం జిల్లా కార్యదర్శి టి.వేణు , నాగిరెడ్డి , ప్రజానాట్యమండలి దేవేందర్ , బొబ్బిలి భారత్ చంద్ర , మణిభూషణాచారి , ఖలీల్ , ఝూన్సీ , సునీత , సృజన , విజయకుమార్ , గుంతేటి వీరభద్రం తదితర 30 మంది విద్యారంగం ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు . రౌండుటేబుల్ సమావేశం ప్రభుత్వ బడులను సౌకర్యవంతంగా తీర్చిదిద్దడానికి మండలానికి నాలుగు తెలంగాణా పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని , ప్రైవేటు పాఠశాల ఫీజులు నియంత్రణ చేయాలని , చట్టబద్ధం గా విద్యకు బడ్జెట్ లో ప్రతిఏటా 18శాతం నిధులు కెటాయించాలని సమావేశం తీర్మానం చేసింది . ఈమూడు అంశాలపై జరిగే ఉద్యమానికి సైతం తనసంపూర్మ మద్దతు రౌండ్ టేబుల్ సమావేశం ప్రకటించింది .

🏠 Home