🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

బుధవారం, 16 Sep 2026, 6:49 PM

QR Code

రోజూ 15 నిమిషాలు చదవండి.. డబ్బులు పొందండి!

News Image

పుస్తకాలు చదివే అలవాటును పెంచేందుకు సింగపూర్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది. ‘రీడ్‌ఎస్‌జీ’ పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో రోజూ కనీసం 15 నిమిషాలు చదివితే 20 వర్చువల్ నాణేలు ఇస్తారు.1,000 నాణేలను ఒక సింగపూర్ డాలర్‌గా మార్చుకునే అవకాశం ఉంటుంది. రోజుకు ఒక పఠన సెషన్‌నే లెక్కలోకి తీసుకుంటారు.

చదివే అలవాటు పెంచడంతో పాటు సామాజిక కార్యక్రమాలకు నిధులు సమకూర్చడం కూడా ఈ పథకం లక్ష్యం. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలో కొనసాగుతోంది.

🏠 Home