🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

గురువారం, 17 Sep 2026, 6:42 PM

QR Code

కోదాడ లో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

News Image

కోదాడ, సెప్టెంబర్ 17: విశ్వకర్మ జయంతి సందర్భంగా కోదాడ పట్టణంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కన్వీనర్ అనంతుల సతీష్, జిల్లా కో-కన్వీనర్ మండవ మధు హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సృష్టికర్త అయిన విశ్వకర్మ జయంతిని ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని అన్నారు. విశ్వకర్మ వారసులం అయిన మనమంతా ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. విశ్వకర్మలకు ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం నాయకులు, సభ్యులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

🏠 Home