🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

గురువారం, 17 Sep 2026, 7:27 PM

QR Code

ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపుపై బీఎంఎస్ హర్షం

News Image

సూర్యాపేట జిల్లా కన్వినర్ అనంతుల సతీష్

కోదాడ సెప్టెంబర్ 17 :ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తప్పనిసరి వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం పట్ల భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కన్వీనర్ అనంతుల సతీష్ హర్షం వ్యక్తం చేశారు. ఇది బీఎంఎస్ పోరాటాల ఫలితమేనని పేర్కొని గురువారం రోజున పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా 51 లక్షలకు పైగా అదనపు ఉద్యోగులు తప్పనిసరి ఈపీఎఫ్ఓ పరిధిలోకి వస్తారని, ఉద్యోగులకు భవిష్య నిధి, పెన్షన్, భీమా రక్షణ మరింత విస్తృతంగా లభిస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వం 'వికసిత్ భారత్ 2047' లక్ష్యాన్ని సాధించే దిశలో పెరుగుతున్న వేతనాలకు అనుగుణంగా కార్మికులకు దీర్ఘకాలిక పదవీ విరమణ భద్రత కల్పించే దిశగా ఇది కీలక అడుగు పడిందన్నారు.

🏠 Home