🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

గురువారం, 17 Sep 2026, 7:39 PM

QR Code

అమరవీరులకు ఘన నివాళులు

News Image

బక్క హేమ్లాతండా, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బక్క హేమ్లాతండా గ్రామపంచాయతీ కేంద్రంలో అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. గ్రామ సర్పంచ్ గుగులోత్ కృష్ణ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా కృష్ణ నాయక్ మాట్లాడుతూ.. స్వేచ్ఛ కోసం పోరాడిన వీరుల త్యాగాలు, తెలంగాణ ప్రజల ఐక్యత, ధైర్యం, పోరాట స్ఫూర్తి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు. వారి ఆశయాలను, ప్రజాస్వామ్య విలువలను, సమానత్వ భావనను కొనసాగించడమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు తెలంగాణ పోరాట గాథలను తెలియజేస్తూ సమాజ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కేతావత్ మంగత్య నాయక్, 5వ వార్డు సభ్యులు మూడ్ మాణిక్యమా చందు నాయక్, మాజీ 5వ వార్డు సభ్యులు మూడ్ వీరన్న నాయక్, మూడ్ రవి నాయక్, పంచాయతీ కార్యదర్శి సత్యవతి, ప్రధానోపాధ్యాయులు ఇంద్రారెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

🏠 Home