🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

గురువారం, 17 Sep 2026, 8:55 PM

QR Code

మోదీ పుట్టినరోజు వేడుకల్లో చంద్రబాబు

News Image

ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వారణాసిలో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు కూడా ఆలయంలో పూజలు నిర్వహించారు.అనంతరం మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ‘వారణాసి–వడోదర సేవా సంకల్ప్‌ అభియాన్‌’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ప్రార్థనలు, దీపాల కార్యక్రమాలు నిర్వహించారు.

🏠 Home