🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

శుక్రవారం, 18 Sep 2026, 7:38 PM

QR Code

హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నాయకుల పర్యటన

News Image

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (ఆర్యాద్వి): బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి హైదరాబాద్‌లో పలు ప్రముఖ ప్రదేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో నిర్మించిన తెలంగాణ నూతన సచివాలయాన్ని సందర్శించారు.అనంతరం అమరవీరుల స్మారక స్తూపం, ట్యాంక్‌బండ్‌పై ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని సందర్శించారు. అలాగే ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🏠 Home