🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 19 September 2026, 8:22 am Posted by : ARYADVI NEWS

వృద్ధాప్యాన్ని ఆపడం కష్టమే.. ఉన్న జీవితాన్ని ఆస్వాదించండి

News Image
వృద్ధాప్యాన్ని ఆపేందుకు, జీవితాన్ని అంతులేకుండా పొడిగించేందుకు ప్రయత్నిస్తున్న టెక్‌ బిలియనీర్లు తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ జిమ్ ఆల్‌-ఖలీలీ అన్నారు.దీర్ఘాయువు కోసం ఖరీదైన చికిత్సలు, ప్రయోగాలు చేయడం కంటే.. మనకు లభించిన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడం ముఖ్యమని ఆయన సూచించారు. బ్రయాన్ జాన్సన్ వంటి టెక్‌ దిగ్గజాలు వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రస్తావించారు.కాలం స్వభావం ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదని ఆల్‌-ఖలీలీ తెలిపారు. ఐన్‌స్టీన్‌ సిద్ధాంతాల ప్రకారం వేగం, గురుత్వాకర్షణ ప్రభావంతో కాలం గడిచే వేగంలో మార్పులు ఉంటాయని వివరించారు.టైమ్‌ ట్రావెల్‌పై మాట్లాడుతూ.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గతంలోకి ప్రయాణించడం గణితపరంగా సాధ్యమేనని, అయితే దాని వల్ల అనేక వైరుధ్యాలు తలెత్తుతాయని చెప్పారు. భవిష్యత్తులోకి ప్రయాణించడం మాత్రం సిద్ధాంతపరంగా సాధ్యమేనని పేర్కొన్నారు.కాలం ఎప్పుడూ ముందుకే సాగుతున్నట్లు కనిపించడాన్ని ‘యారో ఆఫ్ టైమ్’ అంటారు. భౌతిక శాస్త్ర సమీకరణాల్లో కాలానికి నిర్దిష్ట దిశ కనిపించకపోవడం ఒక పెద్ద రహస్యమని ఆయన చెప్పారు.ఈ రహస్యానికి తాను పరిష్కారం కనుగొన్నానని ఆల్‌-ఖలీలీ ప్రకటించారు. త్వరలో నిర్వహించనున్న రాయల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ క్రిస్మస్‌ ఉపన్యాసంలో దీనిపై పూర్తి వివరణ ఇస్తానని తెలిపారు.
🏠 Home