🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

శనివారం, 19 Sep 2026, 6:21 PM

QR Code

విద్యుత్ లైన్లను ఆనుకుని ప్రమాదకరంగా పెరిగిన చెట్లు...

News Image

విద్యుత్ తీగలకు ఉరితాళ్లుగా మారిన చెట్లు

విద్యుత్ అంతరాయంతో అంధకారంలో అమీనాబాద్ 1వ వార్డు

అనంతగిరి, సెప్టెంబర్ 19:మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామం 1వ వార్డులో ప్రైవేటు స్థలంలో విచ్చలవిడిగా పెరిగిన చెట్లు విద్యుత్ తీగలకు ఉరితాళ్లుగా మారాయి.తీగలను తాకుతూ,అల్లుకుపోయిన కొమ్మల కారణంగా ప్రతిరోజూ షార్ట్ సర్క్యూట్,నిప్పురవ్వలు,గంటల తరబడి కరెంటు కట్ తో వార్డు ప్రజలు నరకం అనుభవిస్తున్నారు.గాలి వీచితే చాలు తీగలు తెగి ఇళ్లపై పడే ప్రమాదం ఉందని,ఏ క్షణంలో ఏ ప్రాణం పోతుందోనని 1వ వార్డు వాసులు భయంతో వణికిపోతున్నారు.రాత్రిళ్లు చిన్న పిల్లలు,వృద్ధులు ఉక్కపోతతో అంధకారంలో మగ్గుతున్నారు.విద్యుత్ శాఖ అధికారులు మాత్రం చెట్ల తొలగింపునకు సిద్ధంగా ఉన్నామని,స్థల యజమాని అనుమతి ఇస్తే చాలు వెంటనే జెసిబితో తొలగించి శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.అయినా స్థల యజమాని ఇప్పటి వరకు స్పందించకపోవడం పట్ల వార్డు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా స్థల యజమాని మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి చెట్ల తొలగింపునకు సహకరించాలని,లేని పక్షంలో అధికారులే చర్యలు తీసుకొని గ్రామస్తుల ప్రాణాలను కాపాడాలని 1వ వార్డు వాసులు డిమాండ్ చేస్తున్నారు.

🏠 Home