🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 19 September 2026, 6:25 pm Posted by : ARYADVI NEWS

ఇంటర్ సర్టిఫికెట్ల డిజిటలైజేషన్.. రిటైర్మెంట్ వయసు పెంపు

News Image
అమరావతి: ఏపీ ఇంటర్మీడియట్ బోర్డులో కీలక సంస్కరణలకు మంత్రి నారా లోకేశ్ ఆమోదం తెలిపారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగిన 78వ పాలకవర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.1978 నుంచి జారీ చేసిన ఇంటర్ సర్టిఫికెట్లను డిజిటలైజ్ చేసి, బ్లాక్‌చైన్ టెక్నాలజీతో అనుసంధానించనున్నారు. బోర్డు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని తీర్మానించారు. పరీక్షల సిబ్బంది భత్యాలను 25 శాతం పెంచాలని నిర్ణయించారు. థియరీ పరీక్షలకు 32 పేజీల జవాబు పత్రాలు అందించనున్నారు. మూల్యాంకనంలో తప్పులకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
🏠 Home