🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 19 September 2026, 6:57 pm Posted by : ARYADVI NEWS

భీమిలి వైసీపీ సమన్వయకర్తగా బొత్స అనూష

News Image
విశాఖపట్నం: వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుమార్తె అనూషకు పార్టీలో కీలక పదవి దక్కింది. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఆమెను భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తల సమన్వయ బాధ్యతలను ఆమెకు అప్పగించారు. గతంలో పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అనూష.. తాజా నియామకంతో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
🏠 Home