నేడు బెంగళూరుకు చంద్రబాబు
ఎల్లుండి నుంచి కుప్పంలో పర్యటన.. రూ.9 వేల కోట్ల పనులకు శ్రీకారం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు బెంగళూరులో పర్యటించనున్నారు. అనంతరం సోమ, మంగళవారాల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.289.5 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించి, మరో రూ.38.5 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా రూ.9 వేల కోట్ల హ్యామ్ రహదారి పనులకు కుప్పం నుంచి శ్రీకారం చుట్టనున్నారు.