రీసర్వే పేరుతో భూ సమస్యలు సృష్టించారు: చంద్రబాబు
గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో భూసమస్యలు సృష్టించారని, ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ‘శుక్రవారం వచ్చిందంటే చాలు నాటి ప్రభుత్వంలో కూల్చివేతలే. ఎవరి ఇంటిపైకి వస్తారో.. ఎప్పుడొస్తారో.. ఎందుకొస్తారో తెలీదు. విశాఖను క్యాపిటల్ చేస్తామని చెప్పి.. నేరాలు, ఘోరాలు, భూకబ్జాలకు క్యాపిటల్ చేశారు. ప్రశాంతమైన ఉత్తరాంధ్రకు శాంతి లేకుండా చేశారు’ అని మండిపడ్డారు.