🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

ఆదివారం, 20 Sep 2026, 6:51 PM

QR Code

బహుజనుల బాణం నేనే: కవిత

News Image

కొడంగల్ సభలో రాజకీయ ప్రత్యర్థులకు కవిత కౌంటర్

తన రాజకీయాలపై వస్తున్న విమర్శలకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో బదులిచ్చారు. తాను ఎవరి చేతిలోనూ బాణాన్ని కాదని, బహుజనుల హక్కుల కోసం పోరాడే గొంతుకనని స్పష్టం చేశారు. ఆదివారం కొడంగల్‌లో జరిగిన పాంచజన్య సంకల్ప సభలో మాట్లాడుతూ.. యువత, బహుజనుల కోసం ఎవరితోనైనా పోరాడతానన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అక్షరాస్యత పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మహిళలు, బహుజనులకు రాజకీయాల్లో సముచిత స్థానం దక్కే వరకు తన పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.

🏠 Home