🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

ఆదివారం, 20 Sep 2026, 6:56 PM

QR Code

ఎల్ నినోను ఎదుర్కొనేందుకు సిద్ధం: చంద్రబాబు

News Image

అమరావతి: ఎల్ నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి కార్యాచరణ సిద్ధం చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకోవడంతో పాటు నిత్యావసరాల ధరలు పెరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను నియంత్రించాలని సూచించారు. లోటు వర్షపాతంతో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పంటల బీమా అందించాలని, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

🏠 Home