🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

సోమవారం, 21 Sep 2026, 6:10 PM

QR Code

బీజేపీ టీచర్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా డా. నెల్లూరి బెనర్జీ

News Image

ఖమ్మం జిల్లాకు చెందిన విద్యావేత్తకు రాష్ట్ర స్థాయి బాధ్యత

ఖమ్మం, సెప్టెంబరు 21: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర టీచర్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఖమ్మం పట్టణానికి చెందిన విద్యావేత్త, రాజనీతి శాస్త్ర ఉపాధ్యాయుడు డా. నెల్లూరి బెనర్జీని నియమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర టీచర్ సెల్ కన్వీనర్ కొంజెర్ల శ్రీనివాస్ ఈ నియామకం చేసినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా డా. నెల్లూరి బెనర్జీ మాట్లాడుతూ.. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు.డా. నెల్లూరి బెనర్జీ గతంలో ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, యువ మోర్చాలో వివిధ బాధ్యతల్లో పనిచేశారని, గతంలో బీజేపీ ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.టీచర్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా డా. నెల్లూరి బెనర్జీ నియామకం పట్ల బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

🏠 Home