🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

సోమవారం, 21 Sep 2026, 9:58 PM

QR Code

ట్రాక్టర్ ఢీకొని వృద్ధుడు మృతి

News Image

చింతకాని, సెప్టెంబర్ 21 : మండలంలోని లచ్చగూడెం గ్రామంలో ట్రాక్టర్ ఢీకొని 65 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. సోమవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో తుంగ రమేష్ తన ట్రాక్టర్‌ను అజాగ్రత్తగా రివర్స్ చేస్తుండగా, ట్రాక్టర్ వెనుక ఉన్న తుంగ రఘుపతి (65)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రఘుపతి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ తుంగ రమేష్‌పై చింతకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

🏠 Home