🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 22 September 2026, 6:43 pm Posted by : ARYADVI NEWS

మహిళల భద్రతకు ''సఖి వన్ స్టాప్ సెంటర్"నూతన భవన ప్రారంభం

News Image
ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం జిల్లాలోని మహిళల భద్రత, సంక్షేమం కోసం
నూతనంగా నిర్మించిన 'సఖి వన్ స్టాప్ సెంటర్' భవనాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, సుమారు రూ.48.89 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ భవన ప్రారంభోత్సవం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని,మహిళలకు అండగా నిలుస్తూందని, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలన్న సత్సంకల్పంతో ఈ కేంద్రాన్ని ఒక ప్రత్యేక వేదికగా ఏర్పాటు చేశామన్నారు.
శారీరక, మానసిక, వేధింపులకు గురైన మహిళలు, అవాంఛిత గర్భధారణతో ఇబ్బంది పడుతున్నవారు, లేదా చిన్నారుల సమస్యలతో సతమతమవుతున్నవారు, ఎవరైనా సరే 181 కాల్ సెంటర్‌ను సంప్రదించడం ద్వారా ఇక్కడి సేవలను తక్షణమే పొందవచ్చని, బాధిత మహిళలకు ఇక్కడ ఆశ్రయంతో పాటు, వైద్య సదుపాయం, పోలీసుల భద్రత, న్యాయపరమైన సలహాలు,ఇలా అత్యవసరమైన అన్ని సేవలను, ఒకే చోట అందించడం, ఈ వన్ స్టాప్ సెంటర్ యొక్క ప్రధాన ఉద్దేశమని, రెండు అంతస్తుల్లో నిర్మితమైన ఈ భవనంలో మొత్తం ఆరు గదులు అందుబాటులో ఉంచామని,ఈ నూతన సముదాయం ద్వారా ఆపదలో ఉన్న ప్రతి మహిళకూ అత్యంత సురక్షితమైన వాతావరణంలో పూర్తి స్థాయి రక్షణ లభిస్తుందని ఆయన తెలియజేశారు.
🏠 Home