🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

బుధవారం, 23 Sep 2026, 9:04 AM

QR Code

డిసెంబర్‌లో అమెరికాకు మోదీ.. ట్రంప్‌తో ప్రత్యేక భేటీ!

News Image

ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్‌లో అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. డిసెంబర్ 14, 15 తేదీల్లో ఫ్లోరిడాలోని డొరల్‌లో జరగనున్న జీ20 సదస్సుకు ఆయన హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. భారత్-అమెరికా సంబంధాలు, వాణిజ్యం తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అదే సదస్సు సందర్భంగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన క్వాడ్‌ నేతల సమావేశం నిర్వహించే అవకాశాలపై కూడా సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.అమెరికా పర్యటన అనంతరం మోదీ కెనడాకు వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు ఈ పర్యటన ఉండొచ్చని సమాచారం.అయితే మోదీ అమెరికా పర్యటనపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అధికారిక షెడ్యూల్ ఖరారైన తర్వాత విదేశాంగ శాఖ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

🏠 Home