🏠 aryadvi.com
Watermark

Author HANUMA D.

బుధవారం, 23 Sep 2026, 6:08 PM

QR Code

బెంగాల్‌లో మళ్లీ ఎన్నికలు జరపాలి: మమత

News Image

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణపై వివాదం కొనసాగుతోంది. పాత ఓటర్ల జాబితా ఆధారంగా రాష్ట్రంలో మరోసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌పై మమత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన పదవిలో ఉన్నంతకాలం దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు.టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ కూడా ఓటర్ల జాబితా నుంచి లక్షలాది పేర్లు తొలగించారని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.అయితే ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను ఖండించింది. కీలక నిర్ణయాలు ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతోనే తీసుకున్నామని స్పష్టం చేసింది.

🏠 Home