🏠 aryadvi.com
Watermark

Author HANUMA D.

బుధవారం, 23 Sep 2026, 6:20 PM

QR Code

టెక్కలిలో ఘోర రైలు ప్రమాదం

News Image

రావివలస సమీపంలో ఐదుగురిని ఢీకొన్న రాజారాణి ఎక్స్‌ప్రెస్‌.. నలుగురు మృతి

టెక్కలి, సెప్టెంబరు 23: టెక్కలి మండలం రావివలస సమీపంలో బుధవారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌ దాటుతున్న ఐదుగురిని రాజారాణి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది.వర్షం కారణంగా రైలు రాకను గుర్తించలేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రుడు టెక్కలి, డమర ప్రాంతానికి చెందినవారిగా, ఒడిశాకు చెందినవారిగా స్థానికులు గుర్తించినట్లు సమాచారం.మృతులను విశాఖరావు, దిలీప్‌కుమార్‌, శివ, శరత్‌గా గుర్తించినట్లు సమాచారం. మరో వ్యక్తి సల్మాన్‌రాజ్‌గా తెలిసింది. అయితే మృతులు, క్షతగాత్రుడి వివరాలను రైల్వే అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల పూర్తి వివరాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

🏠 Home