🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 24 September 2026, 6:02 pm Posted by : ARYADVI NEWS

* ప్రభుత్వం వెంటనే రైతు నాదుకోవాలి..

News Image
తుఫాను ప్రభావంతో సుమారు 30 ఎకరాల్లో పంటలు నీటముంపు
ప్రభుత్వం వెంటనే స్పందించాలి – బిజెపి బాడాన యమున *

సరుబుజ్జిలి సెప్టెంబర్ 24 : సరుబుజ్జిలి మండలం వ్యాప్తంగా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సుమారు 30 ఎకరాల వ్యవసాయ భూముల్లోకి నీరు చేరి పంట పొలాలు ముంపునకు గురయ్యాయని మండల బిజెపి మహిళా అధ్యక్షురాలు బాడాన యమున అన్నారు.
భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడిందని ఈ మేరకు గురువారం నాడు తుఫాను ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు..
రోజుల తరబడి పొలాల్లో నీరు నిలిచిపోవడంతో పంటలు పూర్తిగా దెబ్బతిని, వ్యవసాయ భూములు పాడయ్యే పరిస్థితి ఏర్పడిందని పంటల సాగు కోసం రైతులు పెట్టిన పెట్టుబడులు నీటిపాలవడంతో తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధిత అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బందితో పంట నష్టం సర్వే నిర్వహించాలని, ముంపునకు గురైన ప్రతి ఎకరాను గుర్తించి నష్టపోయిన రైతులకు తగిన పంట నష్టపరిహారం అందించాలని మండలం బిజెపి మహిళా అధ్యక్షురాలు బాడాన యమున డిమాండ్ చేశారు.
అలాగే పొలాల్లో నిలిచిన నీటిని త్వరితగతిన బయటకు పంపేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి ముంపు సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత డ్రైనేజీ, నీటి పారుదల సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
🏠 Home