🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

శుక్రవారం, 25 Sep 2026, 7:21 PM

QR Code

మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం కార్యక్రమము....

News Image

వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థుల శాతం పెంచడమే మా లక్ష్యం... మండల తాసిల్దార్ కమలాకర్

అనంతగిరి, సెప్టెంబర్ 25 : అనంతగిరి మండల కేంద్రంలో గురుపూజోత్సవం సందర్భంగా అనంతగిరి మండలానికి సంబంధించి మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు 13 మందిని మరియు జిల్లా స్థాయి అవార్డు పొందిన ఇద్దరికీ సెప్టెంబర్ 25 వ తేదీన మండల విద్యా వనరుల కేంద్రంలో సన్మానం చేయనైనది. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి తల్లాడ శ్రీనివాసరావు అధ్యక్షత వహించినారు. ముఖ్యఅతిథిగా అనంతగిరి మండల తహసిల్దార్ కమలాకర్ పాల్గొన్నారు.

మండల తాసిల్దారు కమలాకర్ మాట్లాడుతూ మన మండలం నుండి జిల్లా స్థాయికి ఇద్దరు ఎంపిక కావడం మరియు 13 మంది మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపిక కావడం చాలా గొప్ప విషయము అనీ, వచ్చే విద్యా సంవత్సరం కూడా కనీసము 15 నుండి 20 శాతం విద్యార్థుల నమోదును పెంచాలని ఈ సందర్భంగా తెలియజేశారు.ఇట్టి కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు పురుషోత్తం, లక్ష్మీ నరసయ్య, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సలీమా, సుజాత, వెంకటేశ్వర్లు మరియు యుటిఎఫ్ మండల అధ్యక్షులు మండవ ఉపేందర్ , పి ఆర్ టి యు మండల అధ్యక్షులు జహీర్, ఎస్ టి యు మండలాధ్యక్షుడు ఖాసిం, టీజీ యూఎస్ మండల అధ్యక్షుడు భూక్య వెంకటేశ్వర్లు, రిసోర్స్ పర్సన్ లు రంగయ్య, నాంచారయ్య ,శేఖర్ నాగేందర్ రెడ్డి మరియు ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

🏠 Home