ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ....
మొదటి విడతలో 210 మంది లబ్ధిదారులకు పత్రాలు అందజేత.
అర్హులైన పేదలకు సొంత ఇంటి కల సాకారమే లక్ష్యం:
వార్డుల వారీగా అందించిన మంజూరు పత్రాలు.
ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.
కోదాడ, సెప్టెంబర్ 25 :కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాల సొంత ఇంటి కలను సాకారం చేయాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా... మొదటి విడతగా మంజూరైన 210 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను కోదాడ శాసనసభ్యులు శ్రీమతి పద్మావతి రెడ్డి ఈరోజు కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వార్డుల వారీగా ఘనంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. పేద ప్రజల సొంత ఇంటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని ఆమె స్పష్టం చేశారు.కోదాడ మున్సిపాలిటీ పరిధిలో మొదటి విడతగా మొత్తం 210 ఇళ్లకు మంజూరు పత్రాలు అందజేయగా, అందులో 198 సాధారణ కేటగిరీ ఇళ్లు మరియు 12 ప్రత్యేక కేటగిరీ ఇళ్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
వార్డుల వారీగా మంజూరైన ఇళ్ల వివరాలు:
1వ వార్డు – 6, 2వ వార్డు – 16, 3వ వార్డు – 3, 4వ వార్డు – 1, 5వ వార్డు – 12, 6వ వార్డు – 8, 7వ వార్డు – 1, 8వ వార్డు – 6, 9వ వార్డు – 5, 10వ వార్డు – 4, 11వ వార్డు – 13, 12వ వార్డు – 1, 13వ వార్డు – 3, 14వ వార్డు – 1, 15వ వార్డు – 7, 16వ వార్డు – 3, 18వ వార్డు – 6, 19వ వార్డు – 11, 20వ వార్డు – 6, 21వ వార్డు – 3, 22వ వార్డు – 6, 23వ వార్డు – 3, 24వ వార్డు – 6, 25వ వార్డు – 3, 26వ వార్డు – 1, 27వ వార్డు – 2, 28వ వార్డు – 2, 29వ వార్డు – 2, 30వ వార్డు – 2, 32వ వార్డు – 6, 33వ వార్డు – 13, 34వ వార్డు – 22, 35వ వార్డు – 14 చొప్పున ఇళ్లు మంజూరయ్యాయి.ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, ఎర్నేని వెంకటరత్నం బాబు, వైస్ చైర్మన్ మల్లేశ్వరి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు, బషీర్, మందలపు శేషయ్య, అధికారులు, స్థానిక కౌన్సిలర్లు,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.