🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 September 2026, 6:45 pm Posted by : ARYADVI NEWS

గ్రీవ్స్ సెంచరీ.. భారత్ ముందు 296 పరుగుల టార్గెట్

News Image
వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత్‌కు 296 పరుగుల లక్ష్యం ఎదురైంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా.. విండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 295 పరుగులు చేసింది.
ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్ 101 పరుగులతో సెంచరీ చేశాడు. మరో ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ 62 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
కుల్దీప్ యాదవ్ తన స్పిన్‌తో విండీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. 40 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.చివర్లో అమీర్ జంగూ 43 బంతుల్లో 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచి విండీస్ స్కోరును 295కు చేర్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు, నితీశ్ రెడ్డి ఒక వికెట్ తీశారు.భారత్ విజయానికి 296 పరుగులు చేయాలి.
🏠 Home