🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

బుధవారం, 30 Sep 2026, 8:14 PM

QR Code

అమెరికా టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు..

News Image

అమెరికా టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం, ఏఐ ఆధారిత టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచడం వంటి కారణాలతో పలు దిగ్గజ సంస్థలు సిబ్బందిని తగ్గిస్తున్నాయి. మేనేజ్‌మెంట్ స్థాయిలను కుదించడంతో పాటు కొన్ని సంప్రదాయ ఉద్యోగాల స్థానంలో ఏఐను ఉపయోగించే దిశగా కంపెనీలు మారుతున్నాయి.యాపిల్‌లోనూ సంస్థాగత మార్పులు జరుగుతున్నట్లు సమాచారం. మిడిల్ మేనేజ్‌మెంట్‌ను తగ్గించి ఇంజినీర్లను ఉన్నత స్థాయి అధికారులతో నేరుగా పనిచేయించే విధానంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సిరి, విజన్ ప్రో, ఏఐ సాఫ్ట్‌వేర్ విభాగాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.వర్క్‌డే సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికను ప్రకటించగా, ఉబర్ 3,300 మందిని తగ్గించే చర్యలు చేపట్టింది. అమెజాన్, మెటా, ఒరాకిల్ వంటి సంస్థల్లోనూ ఉద్యోగాల కోతలు నమోదయ్యాయి. క్రంచ్‌బేస్ గణాంకాల ప్రకారం 2026 జనవరి నుంచి ఆగస్టు వరకు అమెరికాలో టెక్ రంగంలో 94,046 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ఏఐ విస్తరణ నేపథ్యంలో టెక్ ఉద్యోగుల భవిష్యత్తుపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

🏠 Home