🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

బుధవారం, 30 Sep 2026, 9:47 PM

QR Code

ఏపీలో SIR గడువు పొడిగింపు

News Image

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. తాజా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 10 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరించనున్నారు. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 16న ప్రచురించనున్నారు. గత షెడ్యూల్ ప్రకారం తుది జాబితా అక్టోబర్ 9న విడుదల కావాల్సి ఉంది.

పెండింగ్‌లో ఉన్న విచారణలు, నో-మ్యాపింగ్, లాజికల్ డిస్క్రెపెన్సీ కేసులతో పాటు ఫారం 6, 7, 8 దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని ఈసీ అధికారులను ఆదేశించింది. కొత్త గడువులపై రాజకీయ పార్టీలకు సమాచారం ఇవ్వడంతో పాటు ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని సూచించింది. అర్హులైన ఓటర్లు జాబితాలో నమోదు కాకుండా మిగలకుండా ప్రక్రియను పూర్తి చేయడమే పొడిగింపు ఉద్దేశమని ఈసీ పేర్కొంది.

🏠 Home