🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

గురువారం, 01 Oct 2026, 12:04 AM

QR Code

సిరిసిల్ల గడీలపై గురిపెడదాం: రేవంత్

News Image

సిరిసిల్లలో నిర్వహించిన ప్రజాపాలన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. గత పదేళ్ల పాలనలో సిరిసిల్ల అభివృద్ధి చెందకుండా సమస్యలకు కేంద్రంగా మారిందని ఆయన ఆరోపించారు.కేటీఆర్‌ సిరిసిల్ల నుంచి పలుమార్లు గెలిచినా నేత కార్మికుల సమస్యలు, ఆత్మహత్యలు, గల్ఫ్‌ వలసలను ఎందుకు అరికట్టలేకపోయారని రేవంత్‌ ప్రశ్నించారు. కాళేశ్వరం, మానేరు ఇసుక అంశాల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు.నేత కార్మికుల కోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లలో రూ.2,234 కోట్లు ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.1,731 కోట్లు ఇచ్చిందని సీఎం తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు రెండున్నరేళ్లలో రూ.1,700 కోట్ల నిధులు కేటాయించామని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో కాంగ్రెస్‌ జెండా ఎగరాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తూ.. ‘‘సిరిసిల్ల గడీల మీద గురిపెడదాం.. ఫిరంగులమై పేలుదాం’’ అని రేవంత్‌ అన్నారు. సభలో పలువురు రాష్ట్ర మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.

🏠 Home