🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

గురువారం, 01 Oct 2026, 8:00 AM

QR Code

బుర్రిపాలెంలో 3డీ ఇళ్లు.. 45 రోజుల్లోనే నిర్మాణం!

News Image

ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ రంగంలో కొత్త సాంకేతికతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో 100 ఇళ్లను పైలట్ ప్రాజెక్టుగా నిర్మించనున్నారు.ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్‌ (PMAY-G) కింద చేపడుతున్న ఈ ప్రాజెక్టును అక్టోబర్ 4న సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించనున్నారు.కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, రూర్కీలోని సీబీఆర్ఐ సాంకేతిక సహకారంతో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. ప్రత్యేక 3డీ ప్రింటర్లతో కాంక్రీట్ మిశ్రమాన్ని పొరలుగా ముద్రిస్తూ ఇళ్ల గోడలను నిర్మిస్తారు.ప్రతి ఇంటిని సుమారు 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. సంప్రదాయ నిర్మాణ పద్ధతులతో పోలిస్తే 3డీ ప్రింటింగ్ విధానంలో ఇళ్లను 45 నుంచి 60 రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.తక్కువ మంది కార్మికులతో నిర్మాణం చేపట్టడం, నిర్మాణ సమయం తగ్గడం, ముడిసరుకు వృథాను నియంత్రించడం ఈ సాంకేతికత ప్రత్యేకతలుగా చెబుతున్నారు. బుర్రిపాలెం పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను బట్టి రాష్ట్రంలోని పేదల గృహ నిర్మాణంలో ఈ విధానాన్ని మరింత విస్తరించే అవకాశం ఉంది.

🏠 Home