🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 02 October 2026, 8:15 am Posted by : ARYADVI NEWS

2027 వరల్డ్ కప్ షెడ్యూల్.. భారత్-పాక్ ఫైట్ ఎప్పుడంటే?

News Image
2027 వన్డే ప్రపంచకప్‌కు రంగం సిద్ధమైంది. ఐసీసీ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించడంతో భారత్‌-పాకిస్థాన్ మ్యాచ్‌ కోసం అభిమానుల ఎదురుచూపులు మొదలయ్యాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21, 2027 వరకు జరగనుంది.
భారత్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 10న జోహన్నెస్‌బర్గ్‌లో పాకిస్థాన్‌తో తలపడుతుంది. భారత్‌-పాక్ మ్యాచ్‌ కోసం వాండరర్స్ స్టేడియం వేదిక కానుంది.
కొత్త ఫార్మాట్‌లో టోర్నీ
ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 14 జట్లు, 57 మ్యాచ్‌లు ఉంటాయి. ముందుగా మూడు జట్లతో సూపర్ సిరీస్ నిర్వహిస్తారు. ఆ తర్వాత 12 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి గ్రూప్ దశలో పోటీపడతాయి. ప్రతి గ్రూప్‌లో టాప్-3 జట్లతో పాటు రెండు గ్రూపుల్లో మెరుగైన నాలుగో స్థానంలో ఉన్న జట్టు కలిపి ఏడు జట్లు సూపర్-7 దశకు చేరతాయి.
సూపర్-7లో ప్రతి జట్టు మిగిలిన ఆరు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ దశలో టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు వెళ్తాయి. అనంతరం ఫైనల్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.

భారత్ మ్యాచ్‌లు
అక్టోబర్ 7: భారత్ × ఆస్ట్రేలియా — కేప్‌టౌన్
అక్టోబర్ 10: భారత్ × పాకిస్థాన్ — జోహన్నెస్‌బర్గ్
అక్టోబర్ 14: భారత్ × ఆఫ్ఘనిస్థాన్ — ష్వానే
అక్టోబర్ 17: భారత్ × క్వాలిఫయర్ A — బ్లూమ్‌ఫోంటెన్
అక్టోబర్ 24: భారత్ × జింబాబ్వే — విక్టోరియా ఫాల్స్

భారత్ సూపర్-7కు అర్హత సాధిస్తే, అక్కడ కూడా ముందుగా కేటాయించిన A1 సీడింగ్ ప్రకారం మ్యాచ్‌ల షెడ్యూల్ కొనసాగుతుంది. భారత్-పాక్ మరోసారి తలపడే అవకాశం ఉన్న మ్యాచ్‌ నవంబర్ 7న కేప్‌టౌన్‌లో షెడ్యూల్ అయింది.
సెమీస్, ఫైనల్ ఎక్కడంటే?
తొలి సెమీఫైనల్ నవంబర్ 17న కేప్‌టౌన్‌లో, రెండో సెమీఫైనల్ నవంబర్ 18న ష్వానేలో జరగనుంది. ప్రపంచకప్ ఫైనల్ నవంబర్ 21న జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరుగుతుంది.
🏠 Home