🏠 aryadvi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 02 October 2026, 9:05 am Posted by : ARYADVI NEWS

కొరియా ఆధిపత్యానికి చెక్‌.. భారత్‌కు చారిత్రక స్వర్ణం!

News Image
ఏషియన్ గేమ్స్‌ ఆర్చరీలో భారత మహిళల రికర్వ్‌ జట్టు చరిత్ర సృష్టించింది. అంకిత భకత్‌, కీర్తి శర్మ, కుంకుమ్‌ మొహోడ్‌లతో కూడిన భారత త్రయం ఫైనల్లో దక్షిణ కొరియాను 5-3తో ఓడించి స్వర్ణ పతకం సాధించింది.

మహిళల రికర్వ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. 44 ఏళ్లుగా ఈ విభాగంలో కొనసాగుతున్న కొరియా ఆధిపత్యానికి భారత జట్టు తెరదించింది. ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న కొరియాపై ఒత్తిడిని తట్టుకుని భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శన చేశారు.

అంతకుముందు సెమీఫైనల్లో భారత్‌ చైనాను 5-1తో ఓడించి ఫైనల్‌కు చేరింది. సెమీస్‌లో కీలక సమయాల్లో కీర్తి శర్మ వరుసగా 10 పాయింట్ల షాట్లు సాధించి జట్టు విజయానికి దోహదపడింది.

ఫైనల్లో ఉత్కంఠ

కొరియాతో జరిగిన ఫైనల్లో తొలి రెండు సెట్లు 2-2తో సమంగా ముగిశాయి. మూడో సెట్‌లో కొరియా ఆర్చర్లు కొన్ని 8 పాయింట్ల షాట్లు వేయడంతో భారత్‌ 55 స్కోరుతో ఆధిక్యంలోకి వెళ్లింది.

నాలుగో సెట్‌లో ఇరు జట్లు 54 స్కోరు సాధించాయి. కీర్తి శర్మ వేసిన ఓ షాట్‌ను సమీక్షించిన అనంతరం 8 నుంచి 9 పాయింట్లుగా మార్చడంతో భారత్‌ స్కోరు సమమైంది. దీంతో భారత జట్టు స్వర్ణాన్ని ఖాయం చేసుకుంది.
🏠 Home