పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్: బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే మరోసారి ధరలు మీకు షాక్ ఇవ్వొచ్చు. పసిడి ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కొద్దిరోజులుగా ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతుండటంతో కొనుగోలుదారులు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, పశ్చిమాసియా పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం, డాలర్ విలువ, రూపాయి మారకం వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో పసిడి ధరల విషయంలో స్పష్టత లేకుండా పోయింది.
ఇక హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం ఉదయం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,37,110గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,49,580 వద్ద కొనసాగుతోంది. వెండి ధర కూడా భారీగానే ఉంది. కిలో వెండి రూ.2,45,100గా నమోదైంది.
పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం అవసరమైనంత మేరకే కొనుగోళ్లు జరుగుతున్నాయి. పెట్టుబడి కోసం కొనుగోలు చేసేవారు మాత్రం ధరల పరిస్థితిని గమనిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. మార్కెట్లో పరిస్థితులను బట్టి రోజులోనే ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.