🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

శుక్రవారం, 02 Oct 2026, 6:54 PM

QR Code

30 నిమిషాల్లో 3 గోల్డ్స్.. భారత్ జోరు

News Image

2026 ఆసియా క్రీడల్లో భారత్‌కు శుక్రవారం స్వర్ణాల వర్షం కురిసింది. బాక్సింగ్‌, రెజ్లింగ్‌లో సుజీత్ కల్కల్‌, పర్వీన్ హూడా, అంకుష్ పంఘల్ వరుసగా పసిడి పతకాలు సాధించారు. సుమారు 30 నిమిషాల వ్యవధిలో మూడు స్వర్ణాలు రావడంతో భారత పతకాల సంఖ్య 75కి, స్వర్ణాల సంఖ్య 15కి చేరింది.

మహిళల 65 కేజీల బాక్సింగ్ ఫైనల్లో పర్వీన్ హూడా చైనీస్ తైపీకి చెందిన చెన్ నిన్-చెన్‌ను 3-2తో ఓడించి స్వర్ణం దక్కించుకుంది. అనంతరం పురుషుల 80 కేజీల విభాగంలో అంకుష్ పంఘల్ దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్‌సియాంగ్‌పై 4-0తో విజయం సాధించి పసిడి అందుకున్నాడు.

ఇక పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల రెజ్లింగ్‌లో సుజీత్ కల్కల్ అద్భుతమైన పునరాగమనం చేశాడు. ఫైనల్లో తజికిస్థాన్‌కు చెందిన అబ్దుల్‌మజీద్ కుదీవ్ చేతిలో 2-9తో వెనుకబడిన సుజీత్.. వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించి 10-9తో థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేశాడు. దీంతో ఈ ఆసియా క్రీడల్లో రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది.

ఇదిలా ఉంటే, బాక్సింగ్‌లో భారత్‌కు ఇది మరింత ప్రత్యేకమైన రోజు. పర్వీన్‌, అంకుష్‌తో పాటు లవ్లీనా బోర్గోహైన్ కూడా స్వర్ణం సాధించడంతో భారత బాక్సర్లు ఒకే రోజు మూడు పసిడి పతకాలు కొల్లగొట్టారు.

🏠 Home