🏠 aryadvi.com
Watermark

Author ARYADVI NEWS

శుక్రవారం, 02 Oct 2026, 9:26 PM

QR Code

కోదాడకు సినీ శోభ - చెన్నై షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వస్తున్న స్టార్ హీరోయిన్ రితిక నాయక్!

News Image

కోదాడ, అక్టోబర్ 2 (ఆర్యాద్వి): కోదాడ పట్టణ వాసులకు షాపింగ్ అంటే ఇక చెన్నై వెళ్లాల్సిన పనిలేదు.. చెన్నైనే కోదాడకు వచ్చేసింది! పట్టణంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చెన్నై షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ కు ముహూర్తం ఖరారైంది.రేపు (అక్టోబర్ 3) జరగనున్న ఈ ప్రారంభోత్సవానికి టాలీవుడ్ క్రేజీ బ్యూటీ, ప్రముఖ సినీ నటి రితిక నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాల్ ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో కోదాడలో సందడి నెలకొంది.ఒకే చోట ఫ్యామిలీ షాపింగ్: అత్యాధునిక హంగులు, నూతన కలెక్షన్లతో తీర్చిదిద్దిన ఈ మాల్ లో చిన్నారుల నుండి పెద్దల వరకు అన్ని వయసుల వారికి నచ్చే ట్రెండీ డ్రెస్సులు, ఫ్యాషన్ వేర్, ఫ్యామిలీ షాపింగ్ కు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉండనున్నాయి.స్థానిక యువతకు గుడ్ న్యూస్: ఈ మాల్ రాకతో కోదాడ, చుట్టుపక్కల గ్రామాల నిరుద్యోగ యువతకు ఉద్యోగాల పంట పండనుంది. సేల్స్ గర్ల్స్/బాయ్స్, కస్టమర్ కేర్, సెక్యూరిటీ, ఫ్లోర్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో 100 మందికి పైగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.హీరోయిన్ రితిక నాయక్ రాకతో ఓపెనింగ్ వేడుక అదిరిపోనుంది. అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

🏠 Home