డీకాఫ్ కాఫీతో మెమరీ.. కెఫిన్ కాఫీతో చురుకుదనం!
కాఫీ తాగే అలవాటు ఉన్నవారికి ఆసక్తికరమైన విషయాన్ని ఐర్లాండ్ పరిశోధకులు వెల్లడించారు. కెఫిన్ ఉన్న కాఫీ, డీకాఫ్ కాఫీ రెండూ కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించవచ్చని తాజా అధ్యయనంలో గుర్తించారు. అయితే రెండు రకాల కాఫీలు మెదడుపై ఒకే విధమైన ప్రభావం చూపలేదని పరిశోధకులు చెబుతున్నారు.
డీకాఫ్తో జ్ఞాపకశక్తి మెరుగుదల
యూనివర్సిటీ కాలేజ్ కార్క్కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో రోజుకు మూడు నుంచి ఐదు కప్పుల కాఫీ తాగే 62 మందిని పరిశీలించారు. ముందుగా రెండు వారాల పాటు వారికి కాఫీ ఇవ్వకుండా ఉంచారు. అనంతరం ఒక బృందానికి కెఫిన్ కాఫీ, మరో బృందానికి డీకాఫ్ కాఫీ అందించారు.
డీకాఫ్ కాఫీ తీసుకున్న వారిలో జ్ఞాపకశక్తి, అభ్యసన సామర్థ్యంలో మెరుగుదల కనిపించినట్లు పరిశోధకులు గుర్తించారు.
కెఫిన్తో చురుకుదనం
కెఫిన్ ఉన్న కాఫీ తీసుకున్నవారిలో ఆందోళన తగ్గడంతో పాటు అప్రమత్తత, ఏకాగ్రత పెరిగినట్లు అధ్యయనంలో తేలింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రెండు రకాల కాఫీలు తీసుకున్నవారిలోనూ ఒత్తిడి, డిప్రెషన్, ఆవేశపూరిత ప్రవర్తన తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.
పేగు-మెదడు సంబంధం
కాఫీ తీసుకోవడం వల్ల పేగుల్లోని కొన్ని సూక్ష్మజీవుల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు అధ్యయనం వెల్లడించింది. కాఫీలోని కెఫిన్తో పాటు పాలిఫెనాల్స్ వంటి ఇతర సమ్మేళనాలు కూడా పేగు-మెదడు అనుసంధానం ద్వారా ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.
అయితే ఈ ఫలితాలను కాఫీ వల్ల అందరికీ ఖచ్చితంగా ఇదే ప్రయోజనం కలుగుతుందని భావించకుండా, అధ్యయనం పరిమితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.